Search
Close this search box.

ఈ వారం రాశి ఫలాలు 11-08-2024 నుడి 18-08-2024 వరకు

*11-08-2024-ఆదివారం*

                  *రాశి ఫలితాలు*

                     ➖➖➖✍️

“`

మేషం

కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో భాగస్వామితో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో ఆశించిన హోదాలు పొందుతారు.

 

వృషభం

ప్రముఖుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. నూతన వస్తు వాహన లాభాలు ఉన్నాయి. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు.

 

మిధునం

పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం వలన శ్రమాధిక్యత పెరుగుతుంది. చేపట్టిన పనులలో జాప్యం తప్పదు. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి. మిత్రులతో ఊహించని మాటపట్టింపులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

 

కర్కాటకం

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఇంటా బయట ఆలోచనలు అంతగా కలిసి రావు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారాలు సమర్థవంతంగా నిర్వహించలేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి తప్పదు.

 

సింహం

సన్నిహితులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. దూరపు బంధువుల నుండి ఆసక్తికర సమాచారం అందుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహంతో పని చేసి ప్రశంసలు అందుకుంటారు.

 

కన్య

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులలో ప్రతిబంధకాలు ఉంటాయి. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది. బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహారించాలి.

 

తుల

చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. 

 

వృశ్చికం

వృధా ఖర్చులు పెరుగుతాయి. బంధువులతో స్వల్ప మాట పట్టింపులుంటాయి. ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా పడుతాయి. వృత్తి వ్యాపారాలలో కొంత గంధరగోళ పరిస్థితులుంటాయి. ఇంటా బయట పరిస్థితులు అంతగా అనుకూలించవు. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి.

 

ధనస్సు

స్థిరస్తి వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. చేపట్టిన పనులు చకచకా పూర్తి అవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో నూతన వ్యూహాలతో ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

 

మకరం

కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.

 

కుంభం

రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు. నూతన వ్యాపార పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. ఒత్తిడి అధికమైన నిదానంగా పనులు పూర్తి చేస్తారు. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగాలు కొంత నిరాశ కలిగిస్తాయి.

 

మీనం

నూతన ఋణ ప్రయత్నాలు అంతగా అనుకూలించవు. కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా చికాకు కలిగిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. దూరప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఉద్యోగాలలో సమస్యలు అధికమవుతాయి.✍️“`

***************************

   ______________________________

        *_గోమాతను పూజించండి_* 

        *_గోమాతను సంరక్షించండి_*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20250405-WA0368
ఐనవోలు మండల కేంద్రంలో ఘనంగా బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు
గావిచర్ల గుండా బ్రహ్మయ్య జాతరలో యువకుల మధ్య ఘర్షణ ఒకరు మృతి
గావిచర్ల గుండ బ్రహ్మయ్య జాతరలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి 
పోచమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన సిర్పూర్ శాసన సభ్యులు
సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మహిళా సంఘాల సభ్యులు.

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి