పిడుగురాళ్ల:
నేషనల్ యాంటీ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇండియా పల్నాడు జిల్లా శాఖ ఆధ్వర్యంలో పిడుగురాళ్ల తహసిల్దార్ కు భూ సమస్యపై వినతి పత్రం అందించడం జరిగింది.వివరాల ప్రకారం రాజుపాలెం మండలం కోట నెమలిపురి గ్రామానికి చెందిన పల్లా వెంకట నారాయణ కుమారుడు పల్లా నాగేశ్వరరావు చెందిన వ్యవసాయ భూమిని సర్వే నెంబర్ 892/36 లో 2.13 సెంట్లు గల భూమి మీసాల రెబ్బారావు అను అతను రిజిస్టర్ చేసుకొని వేరే వారికి అమ్మటానికి అగ్రిమెంట్ రాసుకుంటున్న తరుణంలో పల్లా నాగేశ్వరరావు తనకు న్యాయం జరగాలని నేషనల్ యాంటీ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇండియా పల్నాడు జిల్లా శాఖను సంప్రదించగా, ఈ విషయమై పిడుగురాళ్ల తహసిల్దార్ కు పూర్వీకుల నుండి వచ్చిన వ్యవసాయ భూమిని నాగేశ్వరావు కుటుంబ సభ్యులకు వచ్చే విధంగా, అదేవిధంగా మీసాల రెబ్బారావు పై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో నేషనల్ యాంటీ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇండియా పల్నాడు జిల్లా శాఖ అధ్యక్షుడు గరికపాటి శంకర్రావు, ప్రధాన కార్యదర్శి కోనేటి నరసింహారావు, ట్రెజరర్ కోట బాబురావు, వ్యవసాయ భూమి హక్కుదారుడు పల్లా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.