అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్‌ప్రెనార్స్ ఆఫ్ ఇండియా (ALEAP) ముఖ్యమంత్రి సహాయ నిధికి 5 లక్షల రూపాయల విరాళం అందించింది. ALEAP అధ్యక్షురాలు కన్నెగంటి రమాదేవి గారు, ఉపాధ్యక్షురాలు అడుసుమిల్లి దుర్గా భవాని గారు, సంయుక్త కార్యదర్శి పల్లవి జోషి గారు MSME పాలసీ -2024 ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారిని కలిసి ఆ మేరకు చెక్కును అందించారు. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి అండగా నిలుస్తూ విరాళం అందించినందుకు వారందరినీ ముఖ్యమంత్రి గారు అభినందించారు.