Search
Close this search box.

అవధూత దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దుండిగల్‌ ఆశ్రమంలో నూతనంగా నిర్మించిన శ్రీ దత్త సభా మంటపాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. ..

ఏ రాష్ట్రంలో అయితే ప్రశాంతమైన వాతావరణం నెలకొని, సంప్రదాయాలు కాపాడబడుతాయో, సంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందించే వాళ్లకు ఎక్కడైతే గౌరవం దక్కుతుందో ఆ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని సంపూర్ణంగా విశ్వసిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు.

🔸అవధూత దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దుండిగల్‌ ఆశ్రమంలో నూతనంగా నిర్మించిన శ్రీ దత్త సభా మంటపాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. 

🔸అనంతరం మాట్లాడుతూ, శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు తెలంగాణకు విచ్చేసినందుకు రాష్ట్ర ప్రజల తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

🔸దసరా నవరాత్రి ఉత్సవాల ప్రారంభ సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ప్రజలందరికీ ముఖ్యమంత్రి గారు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మైసూర్‌లో జరగాల్సిన దసరా నవరాత్రి ఉత్సవ కార్యక్రమాలను స్వామీజీ వారు ఇక్కడ నిర్వహించడం తెలంగాణకు శుభ సూచకమని పేర్కొన్నారు.

🔸శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీ (బాల స్వామీజీ) గారితో పాటు ఈ కార్యక్రమంలో మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, భక్తులు పాల్గొన్నారు.

🔸వేదవ్యాస మహర్షి విరిచితమైన శ్రీమద్భాాగవతానికి పరమపూజ అప్పాజీ గారు రాసిన వ్యాఖ్యాన పుస్తకాన్ని ముఖ్యమంత్రిగారు ఆవిష్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ప్రణస్వి న్యూట్రిషన్ సెంటర్ ప్రారంభించిన మాజీ ఎంపీపీ కందగట్ల. కళావతినరహరి.
IMG-20241221-WA0090
సంగెం మండల కేంద్రంలో ఘనంగా మినీ క్రిస్మస్ వేడుకలు
IMG-20241217-WA0193
మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంటు ఏర్పాటు
అధికార ప్రతినిధిగా ప్రమాణ స్వీకారం చేసిన కందగట్ల నరహరి
IMG-20241217-WA0147
జిల్లా స్థాయి సిఎం కప్ 2024 క్రీడలను ప్రారంబించిన వరంగల్ కుడా ఛైర్మన్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి