Hm9న్యూస్ ప్రతినిథి సికింద్రాబాద్ జిల్లా: తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం సికింద్రాబాద్ లోని హరిహర భవన్ లో జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నామాల అశోక్ మెజిస్ట్రేట్ తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు వాకాటి రాజకుమార్ మరియు కార్యవర్గమును ప్రమాణ స్వీకారం చేయించినారు. ఈ సందర్భంగా కందగట్ల నరహరి మాట్లాడుతూ పద్మశాలి సమాజ అభివృద్ధికి చిత్త శుద్దితో,పూర్తి సామర్ధ్యంతో నా విధులు మరియు భాద్యతలను నిర్వహిస్తానని అన్నారు, ఈ కార్యక్రమంలో నామాల అశోక్ మెజిస్ట్రేట్, వాకాటి రాజుకుమార్, ఈగ మల్లేశం మాజీ అఖిల భారత పద్మశాలి అధ్యక్షులు, బాల్నే శరత్ బాబు వరంగల్ జిల్లా అధ్యక్షులు మరియు తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం కార్యవర్గ సభ్యులు మరియు కొంతం వేణుగోపాల్, అనుమాండ్ల జనార్దన్ రాష్ట్ర పద్మశాలి సంఘం కార్యదర్శులు, బిట్ల రామకృష్ణ,బూర ప్రకాష్ రాష్ట్ర పద్మశాలి సంఘం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు