HM9NEWS ప్రతినిధి ములుగు జిల్లా: ములుగుజిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న బండారుపల్లి గ్రామ శివారులోని సర్వేనెంబర్ 267/1లో 20 గుంటలు, 351/10 లో 7 గుంటలు ప్రభుత్వ భూమిని, అంబేద్కర్ భవన నిర్మాణం కోసం కేటాయించిన భూమిని రెవెన్యూ అధికారుల అండదండలతోఏడు గుంటల భూమిని కబ్జాదారుడు ఆక్రమించిన భూమిని కాపాడాలని బుధవారం దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆర్డీవోను కలిసి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు చుంచురవి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ములుగు జిల్లా కమిటీ అధ్యక్షుడు జన్ను రవి లు మాట్లాడుతూ ములుగు మండలం బండారుపల్లి శివారులోని సర్వేనెంబర్ 351 లో రెండు ఎకరాల ఏడు గంటల ప్రభుత్వ భూమి ఉండగా అందులో నుండి గిరిజన భవనం కొరకు ఎకరం భూమి కేటాయించారు, మిగిలింది ఎకరం ఏడుగుంటలుఉండాలి. అంబేద్కర్ భవనం కు కేటాయించిన సర్వేనెంబర్ 267/1లో 20 గుంటల భూమి ప్రక్కన ఉన్న,సర్వే నెంబర్ 351/10లో ఏడు గుంటల భూమిని కూడా అంబేద్కర్ భవనం కేటాయించారని,ఏడు గుంటల భూమిని భూకబ్జారాయుడు అధికారుల అండదండలతో దర్జాగా కబ్జా చేసి భూమి చుట్టూ కర్రలతో ఫెన్సింగ్ వేశారని తెలిపారు. వెంటనే అధికారులు కబ్జారాయుడు నుండి భూమిని స్వాధీనం చేసుకొని అంబేద్కర్ భవనానికి కేటాయించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు నద్దునూరి రమేష్, షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సమితి ములుగు జిల్లా అధ్యక్షుడు ఎనగందుల కొమురయ్య, తెలంగాణ మాదిగ దండోరా జిల్లా అధ్యక్షుడు బోడ రాములు, అంబేద్కర్ భవన్ నిర్మాణ విగ్రహ పరిరక్షణ జిల్లా చైర్మన్ నెమలి నరసయ్య , ఓరుగంటి అనిల్, బలుగూరి నవీన్, తదితరులు పాల్గొన్నారు.