HM9 న్యూస్ ప్రతినిధి హనుమకొండ జిల్లా: ఉమ్మడి వరంగల్ జిల్లాలో పేరుగాంచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి- 2025 బ్రహ్మోత్సవాల అంకురార్పణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన గౌరవ వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు మరియు టేస్క్యాబ్ చైర్మన్ శ్రీ మార్నెనీ రవీందర్ రావు..తొలుత ఆలయ ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో వేద మంత్రాల నడుమ స్వాగతం పలికారు.అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు ఎమ్మెల్యే, చైర్మన్, ఉత్సవ కమిటీ సభ్యులకు స్వామి కండువా కప్పి వేదమంత్రాలతో అందరినీ ఆశీర్వచనం అందించారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐనవోలు మల్లికార్జున స్వామి వారిని దర్శనం చేసుకుని ఉత్సవాలను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని సిఎం రేవంత్ రెడ్డి, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ సహకారంతో బ్రహ్మోత్సవాలకు అన్ని రకాల వసతులు కల్పిస్తూ ఉత్సవాల సాఫీగా సాగేలా ముందుకు వెళ్తున్నామన్నారు…అనంతరం ఎమ్మెల్యే ఆలయ ఈవో కార్యాలయం నందు ఉత్సవ కమిటీ సభ్యులకు శాలువాలతో సత్కరించి ఉత్సవాల్లో తీసుకోవాల్సిన భక్తులకు ఎలాంటి సౌకర్యం కలవకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలకు వివరించి ఉత్సవాలు సాఫీగా సాగే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలరు…ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కమ్మగొని ప్రభాకర్ గౌడ్ , ధర్మకర్తలు, ఆలయ ఈవో నాగేశ్వరరావు, ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..